కంచికచర్లలో బైక్ ఢీకొని ఇద్దరికి గాయాలు

కంచికచర్లలోని జుజ్జారు రోడ్డుపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వసంత కాలనీకి చెందిన కొండా నాగేశ్వరావు రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నాగేశ్వరావుకు గాయాలు కాగా, వాహనం నడిపిన వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. 108 సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్