వీరులపాడు: 15 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

వీరులపాడు మండలం జయంతి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి అక్రమంగా నిల్వ చేసిన సుమారు 15 టన్నుల రేషన్ బియ్యాన్ని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి వాణి నేతృత్వంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రేషన్ వ్యాపారంపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్