మూడో రోజూ కొనసాగుతూన్నా వాహనాల రద్దీ

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి జనసంద్రమైంది. ఆదివారం మూడో రోజు కూడా వాహనాల రద్దీ కొనసాగింది. చిల్లకల్లు టోల్‌గేట్‌ వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జగ్గయ్యపేట పోలీసులు టోల్‌గేట్‌ వద్ద పహారా కాస్తూ, ప్రయాణికులకు జాగ్రత్తలు సూచిస్తూ వాహనాలను క్రమబద్ధీకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్