తిరువూరులోని అంబేడ్కర్ నగర్లో స్కూటర్ విషయమై స్నేహితుల దాడికి గురైన బాలుడి ఘటన వెలుగులోకి వచ్చింది. జనవరి 27న జరిగిన ఈ దాడిపై జనవరి 30న ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడు బోధనపు జాన్ను మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, 15 రోజులు రిమాండ్ విధించారు.