పెనుగొలనులో పోషకాహార మహోత్సవం

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరులోని గంపలగూడెం మండలం పెనుగొలను 98వ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం జాతీయ పోషకాహార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తీసుకోవాల్సిన పోషకాహారంపై అంగన్వాడి కార్యకర్తలు అవగాహన కల్పించారు. పివి. సాయి లక్ష్మి, ఎం. స్వరూపరాణి, బి. నాగమణి, కె. లింగమ్మ, డి. దివ్యతో పాటు మహిళలు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మహోత్సవం పోషకాహార ప్రాముఖ్యతను తెలియజేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕