గంపలగూడెం మండలం పెనుగొలను 99వఅంగన్వాడి లో బుధవారం పద్మశ్రీ పురస్కార గ్రహీత దరిపల్లి వనజీవి రామయ్య జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రామయ్య ప్రతినిత్యం రాష్ట్రంలో రోడ్డు పక్కన, ఆలయాల్లో, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటే వారని వక్తలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు కోటికి పైగా మొక్కల నాటిన వ్యక్తిగా రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలు, ఆయన నాటిన చెట్లు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తాయని వివరించారు.