పదవి విరమణ చేసిన వెంకట నర్సయ్య కు ఘన సన్మానం

గంపలగూడెం మండలం ఊటుకూరు ప్రాథమిక సహకార సంఘం (PACS) లో 43 ఏళ్లుగా సేవలందించిన ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO) అనంత వెంకట నర్సయ్య, గత నెల 30న పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా, గురువారం ఊటుకూరు పీఏసీఎస్ కళ్యాణ మండపంలో సంఘ పాలకవర్గం, సిబ్బంది ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన చైర్పర్సన్ చెరుకూరి రాజేశ్వరరావు, రైతులకు విశేష సేవలు అందించిన నర్సయ్యను కొనియాడారు.

సంబంధిత పోస్ట్