ఎన్టీఆర్ జిల్లాకు చెందిన భక్తులు రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శ్రీశైలం దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న విజయవాడ కృష్ణలంకకు చెందిన ముగ్గురు వ్యక్తులు పల్నాడు జిల్లా వినుకొండ ఎన్ఎస్పీ రోడ్డు సమీపంలో ప్రెస్ క్లబ్ ఎదుట వారు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొనడంతో స్వల్పంగా గాయపడ్డారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.