విజయవాడలోని ఆటోనగర్, గుణదల, రామవరప్పాడు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు పాన్ షాపులు తెరిచి ఉండటం వివాదాలకు దారితీస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని దుకాణాలు రాత్రి వేళల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాన్ షాపుల వద్ద యువకులు గుంపులుగా చేరడం, రోడ్లపై వాహనాలను ఇష్టారాజ్యంగా నిలపడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు.