తాడేపల్లిలో విజయవాడ వాసి అనుమానాస్పద మృతి

తాడేపల్లి పరిధిలోని జాతీయ రహదారిపై మంగళవారం ఒక వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుని జేబులో లభించిన ఆధార్ కార్డుల ప్రకారం, అతని పేరు బోయ వెంకటేశ్ (48), విజయవాడలోని KL RAO కాలనీకి చెందినవాడని గుర్తించారు. మృతుని నోటి నుంచి నురుగు రావడంతో, ఇది అనుమానాస్పద మృతిగా భావించి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవాగారానికి తరలించి, మృతుని ఆచూకీ తెలిసిన వారు తాడేపల్లి పోలీసులను సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్