విజయవాడ దుర్గమ్మ ఆలయం కీలక నిర్ణయం

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వీఐపీ, వివిఐపీలు దర్శనం కోసం తప్పనిసరిగా టికెట్ కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రోజుకు 200 నుంచి 300 మంది వీఐపీలు, వివిఐపీలు సిఫార్సు లేఖలతో టికెట్ లేకుండా దర్శనం చేసుకుంటున్నారని, దీంతో ఆలయ ఆదాయానికి గండి పడుతోందని ఆలయ ఈవో దృష్టికి వెళ్లింది. ఈ విధానానికి అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్