విజయవాడ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు మృతి

మహానాడు జంక్షన్ నుంచి రమేష్ హాస్పిటల్ వెళ్లే మార్గంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వీరమాచినేని భారతి (65) అనే వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందారు. టాటా మోటార్స్ సమీపంలో రోడ్డు దాటుతున్న సమయంలో ఆటో ఢీకొట్టడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్