విజయవాడ: నకిలీలతో కథ నడిపించాడు

విజయవాడలో నకిలీ ఆధార్, పాన్ కార్డులతో బ్యాంకులను మోసం చేసిన పవన్ కుమార్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఈ-సేవా కేంద్రంలో పనిచేసిన ఇతను, కస్టమర్ల పత్రాలను దొంగిలించి 20 నకిలీ సిమ్ కార్డులు పొందాడు. అమాయకులకు డబ్బులు ఎరచూపి యాక్సిస్ బ్యాంకులో 29 ఖాతాలు తెరిపించి, ఆరు నెలల పాటు లావాదేవీలు జరిపి నమ్మకం కలిగించాడు. అనంతరం క్రెడిట్ కార్డులు, లోన్లు పొంది నాలుగేళ్లలో రూ. 5. 28 కోట్లు కాజేశాడు.

సంబంధిత పోస్ట్