విజయవాడ బస్టాండ్లో ప్రమాదం.. ఒకరి మృతి

విజయవాడ బస్టాండ్ వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. గుడివాడ బస్ వెనుక నుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గత నెల రోజుల్లోనే ఇది మూడవ ప్రమాదమని స్థానికులు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని, ఇంకెంత మంది ప్రాణాలు బలికావాలని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్