కాల్ మనీ వ్యవహారం మరోసారి కలకలం

విజయవాడలో కాల్ మనీ వ్యవహారం కలకలం రేపింది. ఓ మహిళా వ్యాపారిణి రూ.5 కోట్ల అప్పు తీసుకున్నందుకు ఇప్పటికే రూ.21 కోట్లు చెల్లించినా, వడ్డీ వ్యాపారులు ఇంకా డబ్బులు ఇవ్వాలంటూ వేధిస్తున్నారని ఆరోపించారు. దుండగులు తమ ఇంట్లోకి చొరబడి దాడి చేయడంతో పాటు, కుటుంబ సభ్యులను బెదిరించి తమ భూమిని కూడా ఆక్రమించుకున్నారని ఆమె తెలిపారు. ప్రస్తుతం తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్