ఫోన్ కాల్స్ తో మాహిళకు మాజీ భర్త టార్చర్

విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన ఒక మహిళా మీడియా రిపోర్టర్ తన మాజీ భర్త వేధింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నప్పటికీ, ఆమెకు నిరంతరం ఫోన్ కాల్స్ చేస్తూ, ఆమె పనిచేసే కార్యాలయానికి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని బాధితురాలు ఆరోపించారు. ఈ ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం పోలీసులు మంగళవారం ఆమె మాజీ భర్తపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్