విజయవాడలో అగ్నిప్రమాదం.. రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది

విజయవాడ 1 టౌన్ పరిధిలో వినాయక మందిరం ఎదురుగా ఉన్న ఎస్‌కే రివర్‌ఫ్రంట్ హోటల్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడటం ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కొమ్ముకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. ప్రాణనష్టం వివరాలు వెల్లడికాలేదు.

సంబంధిత పోస్ట్