విజయవాడ: యువతిని గర్భవతి చేసి.. యువకుడు పరార్

విజయవాడ సమీపంలోని యనమలకుదురుకు చెందిన 21 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెతో సహజీవనం చేసిన భీమవరానికి చెందిన హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి బాల కేదారేశ్వర స్వామిపై మాచవరం పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. ఇద్దరూ కొంతకాలం కలిసి సహజీవనం చేసిన తర్వాత, యువతి గర్భం దాల్చడంతో బాల కేదారేశ్వర స్వామి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్