విజయవాడలో ఏపీ జెన్కో డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసానికి గురయ్యారు. అధిక లాభాల ఆశ చూపించి మోసగాళ్లు రూ. 30.9 లక్షలు పెట్టుబడిగా పెట్టించి, డబ్బులు వెనక్కి ఇవ్వలేదు. మోసపోయినట్లు గుర్తించిన ఇంజినీర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆన్లైన్ పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.