విజయవాడ: పెళ్లైన నెలకే.. తప్పని వేధింపులు

విజయవాడకు చెందిన ఓ యువతి (28)ని గుంటూరుకు చెందిన ఇజ్జాడ మోహన్సాయికి 2023, నవంబరు 1న వివాహం చేశారు. రూ.40 లక్షల నగదు, రూ.25 లక్షల విలువైన బంగారం కట్నంగా ఇచ్చినా, భర్త, అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించారు. 2023, డిసెంబరులో యువతి అమెరికా వెళ్లినా వేధింపులు ఆగలేదు. ఆడపిల్ల అని తేలడంతో మరింతగా హింసించారు. తీవ్ర మానసిక ఒత్తిడితో గర్భంలోనే బిడ్డ మృతిచెందాడు. వెంటనే గర్భందాల్చాలని భర్త ఒత్తిడి చేయడంతో, 2024, నవంబరు 17న భారత్కు తిరిగి వచ్చిన యువతి, విజయవాడ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్