మంగళవారం హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విజయవాడ గ్రామీణ మండలం వేడమనూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తడపనేని శివరామకృష్ణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఔటర్ రింగ్ రోడ్డుపై పెట్రోలింగ్ చేస్తున్న ఇన్ఛార్జి శ్రీరాములు, పెదఅంబర్పేట్ ఎగ్జిట్ వద్ద కారులో నోటి నుంచి నురుగు వస్తున్న వ్యక్తిని గమనించారు. వెంటనే అంబులెన్స్కు సమాచారం అందించగా, వైద్యులు వచ్చి పరీక్షించి ఆయన అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.