శనివారం మండలంలోని నరసాపురం గ్రామంలో ఫైవ్ స్టార్ ఫైనాన్స్ కంపెనీ వేధింపులకు తాళలేక దబ్బిగొట్ల వెంకట్రావు (42) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ అవసరాల కోసం రూ.4 లక్షలు అప్పుగా తీసుకున్న వెంకట్రావు, అధిక వడ్డీ భారం వల్ల వాయిదాలు చెల్లించలేకపోయాడు. దీంతో ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు ఒత్తిడి చేయడంతో మనస్థాపానికి గురై, పందికొక్కుల నివారణకు వాడే బిల్లలను మింగి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.