'ఇదేం తీరు ?'.. వైఎస్ జగన్‌కు బీవీ రాఘవులు హితవు..

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత బి.వి.రాఘవులు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను అనవసరమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 15 ఏళ్లు అవుతున్నా రాజధానిపై వివాదాలు లేవనెత్తడం సరికాదని, అమరావతిని అందరూ అంగీకరించారని, ఇప్పుడు మళ్లీ వివాదం చేయడం అనవసరమని ఆయన అన్నారు. జగన్ మొదట్లో అమరావతిని రాజధానిగా అంగీకరించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఇకనైనా తన తీరు మార్చుకోవాలని సూచించారు. కృష్ణానది తీర ప్రాంతంలో అమరావతి ఉందా లేదా అనే చర్చకు అర్థం లేదని, రాజధాని నిర్మాణంలో లోపాలు, అవినీతి ఉంటే ప్రశ్నించాలని, రాజధానిని అంగీకరించి, అభివృద్ధి చేసేలా కూటమి ప్రభుత్వం, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా సహకరించాలని రాఘవులు సూచించారు.

సంబంధిత పోస్ట్