తంబళ్లపల్లె కోర్టు కేసుకు హాజరయ్యేందుకు వచ్చిన మాజీ మంత్రి జోగి రమేశ్.. ఆదివారం తిరుపతి (D) తుమ్మలగుంటలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. చెవిరెడ్డి నివాసంలో ఉండగానే ఇబ్రహీంపట్నంలోని తన ఇంటిపై దాడి జరిగిన విషయం తెలుసుకుని ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు.