నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు సోమవారం నాడు గంజాయి అక్రమ రవాణాపై చర్యలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు జొన్నలగడ్డ సారమ్మ, జై సూర్య అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై జై కృష్ణమోహన్ తెలిపారు. నిందితులు అటవీ ప్రాంతాల నుంచి గంజాయిని తెచ్చి నున్న, సింగ్ నగర్, సత్యనారాయణపురం ప్రాంతాల్లోని యువతకు అలవాటు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.