గుర్తుతెలియని వాహనం ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు

విజయవాడ నగర శివారులోని పశ్చిమ బైపాస్​పై శనివారం గుర్తుతెలియని వాహనం కారును ఢీకొనడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనతో రోడ్డుపై తీవ్ర గందరగోళం నెలకొంది. క్షతగాత్రులను వెంటనే 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. క్షతగాత్రులు హైదరాబాద్ నుండి అమలాపురం వెళ్తున్నట్లుగా సమాచారం.

సంబంధిత పోస్ట్