పద్మావతి అమ్మవారికి రూ. 23 లక్షల విలువైన బంగారు కర్ణపత్రాల సమర్పణ

AP: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడు కె. దీపక్ రూ. 23 లక్షల విలువైన 178 గ్రాముల బంగారు, రాళ్లతో పొదిగిన జత కర్ణపత్రములను గురువారం బహుకరించారు. టీటీడీ అధికారులకు ఈ కర్ణపత్రములను అందజేసిన భక్తుడికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు బాబు స్వామి, సూపరింటెండెంట్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్