AP: త్వరలో డీఎస్సీ వేస్తామని గురువారం అసెంబ్లీలో మంత్రి లోకేశ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. గతేడాది డీఎస్సీలో 16,347 పోస్టులలో మిగిలిన వాటితో పాటు ఇతర ఖాళీలు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం విధివిధానాలు, ఇతర అంశాలపై కసరత్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. మొత్తంగా 3600 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో మోడల్, రెసిడెన్షియల్ స్కూళ్లలో 1,200, ప్రభుత్వ, మండల పరిషత్ పాఠశాలల్లో 1,700, స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో 700 పోస్టులు ఉన్నాయి.