అక్క ఎంపీటీసీ.. చెల్లెలు సర్పంచి

AP: అక్కాచెల్లెళ్లు ఒకే గ్రామంలో రెండు కీలక పదవులు దక్కించుకున్నారు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం కలుగోడుకు చెందిన పి. విజయమ్మ ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొందగా, ఆమె చెల్లెలు కాలవ వసంతమ్మ అదే గ్రామ సర్పంచిగా విజయం సాధించారు. వీరిద్దరూ తోబుట్టువులే కాకుండా ఒకే ఇంటి కోడళ్లు కావడం విశేషం. గ్రామాభివృద్ధికి కలిసి కృషి చేస్తామని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕