ఒక వైపు తీవ్ర వడగాల్పులు.. మరోవైపు వర్షాలు

ఏపీలోని పలు జిల్లాల్లో బుధవారం తీవ్ర వడగాల్పులు, వర్షాలు పడనున్నాయి. పోలవరం జిల్లా చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు, విజయనగరం జిల్లా బాడంగి, మెరకముడిదాం, తెర్లాం, మన్యం జిల్లా గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, సీతానగరం, పోలవరం జిల్లా ఎటపాక మండలాల్లో వడగాల్పులు వీస్తాయని APSDMA తెలిపింది. మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వానలు పడతాయంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్