AP: వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచిన వెంటనే ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తామని, కూటమి నాయకులు, అధికారులను తమ కార్యకర్తల ఇంటివద్దకే తీసుకెళ్లి రప్పా, రప్పా చేస్తానని MLC అరుణ్‌కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికి కూటమి పాలకులు రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, దీనికి బదులు తీర్చుకుంటామన్నారు.