AP: పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. వచ్చే నెల నుంచి రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో ఒంటిపూట బడులను మార్చి మొదటి వారం నుంచే నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. దీనిపై విద్యాశాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.