ప్రతి 3 బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యం: వైఎస్ జగన్

AP: వైసీపీ అధినేత జగన్ ఆదివారం సంచలన ట్వీట్ చేశారు. మద్యానికి సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని, నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ 1గా మారుస్తారని ఆరోపించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో టీడీపీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం ఫ్యాక్టరీ పెట్టారన్నారు. ప్రతి 3 బాటిళ్లలో ఒక కల్తీ మద్యం ఉంటుందని, ఆదాయం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేశారు.

సంబంధిత పోస్ట్