రైతు బజార్లలో కిలో రూ.35కే ఉల్లి

AP: రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లలో ఉల్లిపాయలను కిలో రూ.35కే విక్రయించాలని నిర్ణయించింది. ధరల స్థిరీకరణలో భాగంగా రేపటి నుంచి విజయవాడలోని అన్ని రైతు బజార్లలో సబ్సిడీ ధరకు ఉల్లిపాయలు అందుబాటులోకి రానున్నాయి. ఆధార్ లేదా రేషన్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి నెలకు రెండు కేజీల చొప్పున ఉల్లిపాయలను విక్రయించనున్నారు. ప్రజల డిమాండ్‌ను బట్టి ఈ సబ్సిడీ విక్రయాలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతు బజార్లకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్

✕
✕