AP: టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు వైసీపీ అధినేత జగన్ మాత్రమే న్యాయం చేయగలరని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. రాష్ట్రంలోని 10 లక్షల టిడ్కో ఇళ్లు, పేదల గృహాల సమస్యలపై జగన్‌తో మాట్లాడి ఆయన చేతనే స్పష్టమైన హామీ ఇప్పిస్తానని కొడాలి నాని తెలిపారు. లబ్ధిదారులకు న్యాయం చేసే దమ్ము జగన్‌కే ఉందన్నారు. బ్యాంకుల ఒత్తిడి లేకుండా, ఇళ్లను స్వాధీనం చేసుకోకుండా తాము అడ్డుకుని పేదలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.