ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల

AP: రాష్ట్రంలో APOSS ఎస్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మార్చి 16 నుంచి 28 వరకు జరిగిన ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్, వాట్సప్‌ గ్రూప్‌, డిజిలాకర్‌ ద్వారా ఫలితాలను పొందవచ్చు. పదో తరగతిలో 24,949 మంది హాజరుకాగా, 6,277 మంది (25.12%) ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్‌లో 55,048 మందికి 23,755 మంది (43.15%) ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతిలో కోనసీమ జిల్లా 83.07% ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలవగా, బాపట్ల జిల్లా 01.03%తో వెనుకబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్