AP: అదృశ్యమైన బాలికలను వెతికి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ‘ఆపరేషన్ ట్రేస్’ నిర్వహిస్తున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. శుక్రవారం నుంచి ఈ నెల 31 వరకు ఆపరేషన్ ట్రేస్ కొనసాగుతుందన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటామని, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రెడ్ లైట్ ఏరియాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తామన్నారు. బాలికలు అదృశ్యమైతే 112, 1098 హెల్ప్‌లైన్ లేదా 79934 85111 వాట్సాప్ నంబర్ ద్వారా వివరాలు తెలియజేయాలని సూచించారు.