సీఎం చంద్ర‌బాబు సభకు రాలేదని ఉపాధి హామీ కూలీల‌పై క‌క్ష‌ (వీడియో)

AP: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఉడతవారిపాలెంలో సీఎం చంద్రబాబు సభకు హాజరు కాలేదనే కారణంతో ఉపాధి హామీ కూలీలను పని చేయకుండా అడ్డుకుంటూ ఫీల్డ్ అసిస్టెంట్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని చిల్లకూరు మాజీ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే, కలెక్టర్, ముఖ్యమంత్రి ఎవ‌రికైనా చెప్పుకోండి అంటూ ఫీల్డ్ అసిస్టెంట్ బెదిరిస్తున్నారని కూలీలు వాపోతున్నారు. ఈనెల 1వ తేదీన పునపర్తివారిపాలెం ముఖ్యమంత్రి సభకు రాలేదని కక్ష కట్టి పేదలపై ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. అధికారులు స్పందించి పేదలకు న్యాయం చేయాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్