AP: టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, సమాచార పౌరసంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్‌రెడ్డిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ధర్మారెడ్డి, విజయ్ కుమార్‌రెడ్డిల పదవీ కాలంలో భారీ అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ధర్మారెడ్డిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగా.. విజయ్ కుమార్‌రెడ్డిపై జర్నలిస్టు సంఘాలు ఫిర్యాదు చేశాయి.