AP: బంగారుపాళ్యం పర్యటనలో జగన్ మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మిర్చి, పొగాకు, మామిడి రైతుల సమస్యలపై తానే మాట్లాడుతున్నానని చెప్పారు. దాదాపు 1200 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఇది న్యాయమా? మీరు మనుషులేనా? అని ప్రశ్నించారు. ఎవరికైనా సమస్య వచ్చినా తానే ముందుంటానని తెలిపారు. 2029 ఎన్నికల్లో తమ ప్రభుత్వమే వస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, జగన్ పర్యటనలో ఓ యువకుడు గాయపడ్డ విషయం తెలిసిందే.