AP: కడప రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మేయర్‌గా పాకా సురేశ్ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ప్రకటించారు. వైసీపీకి చెందిన 38 మంది కార్పొరేటర్లు పాకా సురేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలో టీడీపీ పోటీ చేయకపోవడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవం అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, కడప నగరంలో వైసీపీ తన పట్టును నిరూపించుకుంది.