పాకిస్తాన్ కు బిగ్ షాక్ తగిలింది. యాచకులను ఎగుమతి చేసే దేశంగా పాకిస్తాన్ కు ఓ పేరు ఉంది. అయితే, తాజాగా సౌదీ అరేబియాలో పాక్ కు చెందిన 5,033 మంది బిచ్చగాళ్లను వారి పాకిస్తాన్‌కు బలవంతంగా తిరిగి పంపించింది. మరో 369 మందిని ఇతర దేశాలకు అప్పగించేసింది. ఈ విషయాన్ని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహసిన్ నక్వీ ఇటీవల నేషనల్ అసెంబ్లీలో ప్రసంగించినట్లు డాన్ పత్రిక కథనంలో రాసుకొచ్చింది.