అనంతపురం జిల్లాలో వలపు వల ఘటన కలకలం రేపింది. పల్నాడుకు చెందిన యువకుడిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువతి, గుత్తికి రప్పించుకుని, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ ఆమెతో పాటు ఉన్న గ్యాంగ్, యువకుడిపై దాడి చేసి డబ్బు, బంగారం, మొబైల్ ఫోన్‌ను అపహరించుకుపోయింది. యువతి ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసి, దోచుకున్న తీరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.