చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. నిందితుడిని విశాఖపట్నంలోని ప్రత్యేక హోంకు తరలించాలని కోర్టు ఆదేశించింది. కేసు విచారణను సమర్థంగా నిర్వహించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారులను, కోర్టు మానిటరింగ్ సిబ్బందిని పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు అభినందించారు.