చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదంలో 11 గొర్రెల మృతి

శుక్రవారం చిలకలూరిపేట మండలం ET జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 గొర్రెలు మృతి చెందగా, 19 తీవ్రంగా గాయపడ్డాయి. దోర్నాల నుంచి చిలకలూరిపేట వైపు వస్తున్న టాటా ఏస్ వాహనం గొర్రెల మందను ఢీకొట్టింది. వాహనం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు ఆరోపించారు. ఈ ఘటనపై రూరల్ పోలీస్ స్టేషన్‌లో గొర్రెల యజమానులు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్