చిలకలూరిపేట మండలం ఎడవల్లి సమీపంలో గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి చిలకలూరిపేట వైపు వస్తున్న బొలెరో వాహనాన్ని ఒక గ్రానైట్ లారీ ఢీకొనడంతో బొలెరో వాహనం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. 108 సిబ్బంది ఈఎంటి శోభన్ బాబు సంఘటనా స్థలంలోనే ప్రధమ చికిత్స అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.