చిలకలూరిపేటలో ముగిసిన క్రికెట్ పోటీలు

చిలకలూరిపేట మండలం కావూరులో అప్పాపురం మార్గంలో ఈ నెల 3వ తేదీ నుంచి నిర్వహిస్తున్న కావూరు యూత్ టెన్నిస్ బాల్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ఆదివారం ముగిసాయి. కావూరు ప్రిన్స్ యూత్ , ఇర్లపాడు జట్లమధ్య హోరాహోరీగా జరిగిన పోరులో కావూరు యూత్ జట్టు విజేతగా నిలిచింది. విజేత జట్టు కావూరు ప్రిన్స్ యూత్ కు పట్టణానికి చెందిన జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సభ్యులు జెర్రిపోతుల బుల్లిబాబు రూ. 20, 116 మొదటి బహుమతిగా అందజేశారు.

సంబంధిత పోస్ట్