మద్యం మత్తులో కారు హల్‌చల్.. పలు వాహనాలు ధ్వంసం

చిలకలూరిపేటలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి కారుతో బీభత్సం సృష్టించాడు. రాగన్నపాలెంలోని ఆవుల దొడ్డి బజార్లో శనివారం తెల్లవారుజామున వేగంగా కారు నడుపుతూ రోడ్డుపై నిలిపి ఉన్న పలు వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో వాహనాలు దెబ్బతినగా, పెద్ద శబ్దాలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అర్బన్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్