యడ్లపాడులో హిట్ అండ్ రన్.. బైక్‌దారుడికి తీవ్ర గాయాలు

పల్నాడు జిల్లా యడ్లపాడు వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రంథి తులసీరామ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గొట్టిపాడు నుంచి గణపవరం వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం తర్వాత కారు డ్రైవర్ వాహనం ఆపకుండా పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్