చిలకలూరిపేటలో లారీ ప్రమాదం.. విద్యుత్ స్తంభం ధ్వంసం

చిలకలూరిపేట పట్టణంలో రాజీవ్ గృహకల్ప సమీపంలో రోడ్డు పక్కన నిలిపిన వాహనాన్ని ఢీకొన్న లారీ, విద్యుత్ స్తంభాన్ని బలంగా తాకింది. ఈ ఘటనలో స్తంభం పూర్తిగా విరిగి నేలకొరిగింది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ సంఘటనతో స్థానికంగా కొద్దిసేపు కలకలం రేగింది. అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి పరిస్థితిని అంచనా వేశారు.

సంబంధిత పోస్ట్